Tirumala : రథసప్తమి వేళ ఈ సాయంత్రం తిరుమలలో స్పెషాలిటీ ఇదే

Update: 2025-02-04 09:00 GMT

రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లో అన్నప్రసాదం పంపిణీ, తాగునీరు పంపిణీ ఏర్పాట్లను స్పెషల్ టీమ్స్ చూస్తున్నాయి. పోలీసు, విజిలెన్స్ సమన్వయంతో మాడవీధుల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాల పై స్వామివారు తిరుమాడవీధుల్లో ఊరేగుతారు. రథసప్తమి సందర్భంగా రెండు నుంచి మూలు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు అన్నప్రసాదాల పంపిణీ నిరంతరాయంగా కొనసాగనుంది.సీసీ కెమెరాలతో జనం రద్దీని మానిటర్ చేస్తూ తొక్కిసలాట ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు రెట్లు అధిక భద్రత కల్పించారు. 

Tags:    

Similar News