తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాజీ టీమ్ ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిన్న వయస్సులో వైభవ్ సూర్య వంశి అద్భుతమైన రీతిలో పరుగులు సాధిస్తున్నారని అన్నారు. రెండవ అత్యధిక స్కోర్ సాధించి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించారని తెలిపారు. కామెంట్రీ బాక్స్ నుంచి ఆ మ్యాచ్ చూస్తూ ఉండటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు. సౌత్ ఇండియా నుంచి చాలా మంది క్రికెటర్లు రావాలని కోరుకున్నట్లు తెలియజేశారు.