TTD : వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు... పెద్ద శేషునిపై మలయప్ప...!

Update: 2025-09-25 06:00 GMT

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నులపండువగా సాగె శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని భక్తుల ప్రఘాడ విశ్వాసం.

పెద్దశేష వాసంలో విహరిస్తున్న శ్రీవారిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్ ను దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగాయకుల మండపంలో సీఎం చంద్రబాబుకి వేదపండితులు వేదాశీర్వచనం అందించగా....ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ 2026 క్యాలెండర్స్., డైరీలను సీఎం ఆవిష్కరించారు. తదనంతరం ఆలయం వెలుపల గల వాహన మండపంకు చేరుకొని పెద్దశేష వాహనంలో పాల్గొన్నారు. తదనంతరం వాహన మండపం నుంచి పద్మావతి అతిధి గృహానికి చేరుకున్నారు.

Tags:    

Similar News