Kumbh Mela : కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యకు అస్వస్థత

Update: 2025-01-15 10:00 GMT

యాపిల్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి లారీన్‌ పావెల్‌ జాబ్స్‌ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అస్వస్థతకు గురయ్యారు. మహా కుంభమేళాకు ఆమె ఇటీవలే హాజరయ్యారు. ఆమె స్వల్పంగా అస్వస్థతకు గురైనట్టు సమాచారం. కొత్త వాతావరణం కారణంగా కొంత ఇబ్బంది పడ్డారని నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్‌ స్వామి కైలాసానంద గిరి మహరాజ్‌ తెలిపారు. ప్రస్తుతం లారీన్‌ తాము ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స తీసుకుంటున్నారని.. ఆరోగ్యం కుదుటపడ్డాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని వెల్లడించారు.

Tags:    

Similar News