తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ధన్ పాల్ సూర్యనారాయణలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. మరోవైపు తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు నందు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు..