Kumbh Mela : మహా శివరాత్రితో మహా కుంభమేళాకు తెర

Update: 2025-02-26 09:45 GMT

ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక మహాకుంభ మేళా నేటితో ముగియనుంది. మహా శివరాత్రి పర్వదినంతో ఈ మహత్తర కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకు 65 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చివరి రోజైన ఇవాళ 2 కోట్ల మంది రానున్నట్లు అంచనా.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహారాష్ట్ర నాసిక్ త్రయంబకేశ్వరం 10వది. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చిన శివుడు, ఆదిపరాశక్తితో పాటు బ్రహ్మ, విష్ణు సమేతంగా ప్రత్యక్షమవుతారు. గంగ ప్రవహించేలా చేయమని ముని కోరటంతో తన జటాజూటాన్ని విసరగా అది బ్రహ్మగిరి పర్వతంపై పడి ప్రవాహంగా వచ్చిందనేది స్థలపురాణం. ఆదిపరాశక్తి, త్రిమూర్తులు స్వయంభువుగా వెలియడంతో జ్యోతిర్లింగంగా మారింది. త్రిమూర్తులు ఒకేచోట లింగం రూపంలో ఉంటారు.

Tags:    

Similar News