నవంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీనివాసుడి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు ఈనెల 24న ఉ.10 గంటలకు విడుదల కానున్నాయి. అదేరోజు మ.3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్స్ అందుబాటులోకి వస్తాయి. ఇక నవంబర్‌లో నిర్వహించే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ఈనెల 19 ఉ.10 గంటల నుంచి 21 ఉ.10 గంటల వరకు జరగనుంది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. అందుకే అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవల్ని టీటీడీ రద్దు చేస్తుంది. అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రద్దు చేశారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.