Tirumala Brahmotsavam : సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు..!
Tirumala Brahmotsavam: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీవారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.;
Tirumala Brahmotsavam: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీవారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిఏటా ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చినజీయర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.