నేడు శ్రీ గాయత్రీ దేవి అవతారం.. ఏ పూలతో పూజ చేయాలంటే

Update: 2025-09-23 07:29 GMT

దసరా నవరాత్రుల్లో రెండో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు.. ఈ రూపంలో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి, పంచ ముఖాలు, పది కళ్లతో, భూమి, ఆకాశం, సృష్టిని సూచించే రంగుల కిరీటంతో ముక్తా, హేమ, నీల, విద్రుమ, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటారు. ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పించాలి. పసుపు రంగు పూలతో పూజించాలి. ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి. ఈరోజు అమ్మవారిని ఈ మంత్రంతో పఠించాలి.

‘ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి! ధియో యో నః ప్రచోదయాత్!!’ అనే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదని పురాణాలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చొని జపం చేయాలి. ఇలా రోజూ చేస్తే జీవితంలో ఒత్తిడి, ఆందోళన తగ్గి సంతోషం, గెలుపు దక్కుతాయని, దుఃఖం, బాధలు, దారిద్ర్యం, పాపాలన్నీ తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News