తిరుమల ఆలయ పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయ, విద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని ఆదేశించింది. కొంతకాలంగా కొందరు రాజకీయ నేతలు దర్శనం తరువాత ఆలయం ముందు మీడియా ముందుకు వచ్చి రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం అలవాటుగా మారింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందని భావించిన టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటోంది.