TTD Chairman : వైఎస్ జగన్ ఛానెల్‌పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా...
వైఎస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువునష్టం దావా వేశారు. ఆగస్టు 10, 14 తేదీల్లో సాక్షి టీవీ ఛానెల్, పత్రికల్లో టీటీడీకి వ్యతిరేకంగా నిరాధారమైన వార్తలు ప్రచురించినందుకు ఈ దావా వేశారు. దీనివల్ల తన వ్యక్తిగత ప్రతిష్ఠకే కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని నాయుడు ఆరోపించారు. ఈ విషయంలో సాక్షి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అలాగే టీటీడీకి రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.