TTD Chairman B.R. Naidu : వకుళమాత ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధిచేస్తాం : బీఆర్ నాయుడు

Update: 2025-07-19 08:00 GMT

పాతకాల్వ పేరూరు బండపై వెలసిన వకుళమాత ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు తెలిపారు. పేరూరు వకుళామాత ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, క్యూ లైన్లు పరిశీలించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులపై నివేదిక తయారు చేయాలని టిటిడి అధికారులకు సూచించారు. తక్షణం చేపట్టాల్సిన పనుల వివరాలను తమ దృష్టికి తీసుకువస్తే టిటిడి బోర్డులో చర్చించి ఆమోదం తెల్పుతామన్నారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు చైర్మన్ కు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేపట్టి అమ్మవారి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Full View

Tags:    

Similar News