TTD : భక్తులకు టీటీడీ చైర్మన్ గుడ్ న్యూస్..

Update: 2025-07-07 06:30 GMT

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల ఆకలి తీర్చే తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై రాత్రి కూడా అల్పాహారం అందించనుంది. నాణ్యతతోపాటు రుచికరమైన అన్నప్రసాదం అందించడమే తమ లక్ష్యం అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన సమయంలోనే కాకుండా రాత్రి భోజన సమయంలో కూడా వడలను వడ్డించనున్నట్టు పేర్కొంది. కాగా ఈ వడల పంపిణీని టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. స్వయంగా భక్తులకు వడ్డించి వారితో మాట్లాడారు. ప్రతిరోజు సుమారు 70 వేల వడలను తయారు చేయనున్నట్టు తెలిపారు.

రెండు అంతస్తులలో ఉన్న శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కాంప్లెక్స్ లో నాలుగు పెద్ద హాళ్లు ఉన్నాయి. ఒక్కో హాల్లో ఒకేసారి వెయ్యి మంది కూర్చుని తినగలిగే సౌకర్యం ఉంది. ప్రతిరోజు 12 గంటల పాటు అన్నదానం జరపబడే ఈ కాంప్లెక్స్ లో సుమారు వెయ్యి మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అత్యాధునిక యంత్రాలతో భక్తులకు భోజన సదుపాయమే కాకుండా వివిధ రకాల అల్పాహారాలు కూడా అందిస్తూ భక్తుల ఆకలి తీరుస్తోంది టీటీడీ.

Tags:    

Similar News