TTD : ఎన్ఆర్ఐలకు టీటీడీ గుడ్ న్యూస్.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100కు పెంపు

Update: 2025-07-21 07:30 GMT

ఎన్ఆర్ఐలకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ప్రవాసాంధ్రులకు తిరుమల వెంకన్న దర్శనం సులభంగా లభించనుంది. ఎన్ఆర్ఐలకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనం కోటాను 10 నుంచి 100కి పెంచారు. రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీకి సీఎం చంద్రబాబు సూచించారు. గతంలో ఏపీ ప్రవాసాంధ్రుల సోసైటి ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. వైసీపీ హయాంలో తిరుమలలో ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనం కోటాను 50 నుంచి 10 తగ్గించారని సీఎంకు తెలిపారు. దీంతో విదేశాల నుంచి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు తిరుమలలో ఎన్ఆర్ఐలకు బ్రేక్‌ దర్శనాల కోటాను పెంచాలని టీటీడీకి సూచించగా.. టీటీడీ దాన్ని 100కు పెంచింది.

Tags:    

Similar News