TTD : పూర్తి స్థాయిలో కొలువుదీరిన టీటీడీ పాలక మండలి

Update: 2025-09-11 12:07 GMT

టీటీడీ పాలకమండలిలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ బోర్డులో 29వ సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 29 మంది సభ్యులతో కూడిన బోర్డును గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, సభ్యుడిగా ఉన్న జస్టిస్ హెచ్.ఎల్. దత్తు బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో దత్తు స్థానంలో సుదర్శన్ వేణును నియమిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో టీటీడీ పాలకమండలి పూర్తిస్థాయిలో కొలువుదీరినట్లయింది.

Tags:    

Similar News