TTD : టీటీడీ కీలక నిర్ణయం.. అగస్టు 1 నుంచి..

Update: 2025-07-24 08:45 GMT

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం కేటాయించే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇప్పటివరకు రోజూ ఆన్‌లైన్‌లో 150, తిరుపతిలో హోమం వద్ద క్యూలైన్లో ఉన్నవారికి 50 టికెట్లు కేటాయించేవారు. ఇకనుంచి హోమం వద్ద టికెట్లు ఇచ్చే ప్రక్రియను రద్దు చేశారు. మొత్తం 200 టికెట్లను ఆన్‌లైన్‌లో కేటాయించే ప్రక్రియకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.

Tags:    

Similar News