TTD : పాత పద్ధతిలోనే బ్రేక్ దర్శనాలు: టీటీడీ

Update: 2025-05-02 09:30 GMT

తిరుమల శ్రీవారి ఆలయంలో అమలవుతున్న బ్రేక్ దర్శనాల సమయాన్ని గురువారం నుంచి టీటీడీ మార్పు చేసింది. మార్చి 24న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో విఐపి బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్పు చేసి, పూర్వ పద్దతిలోనే ఉదయం సమయంలో భక్తులకు బ్రేక్ దర్శనానికి అనుమతించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో పాలకమండలి ఆదేశాల మేరకు గురువారం నుంచి ప్రయోగాత్మకంగా దర్శనాల సమయాల్లో టీటీడీ మార్పు చేసింది. గురువారం కావడంతో స్వామివారి వారపు సేవే అయిన తిరుప్పావడ సేవ నిర్వహించడంతో ఉదయం 8 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని విఐపిలను టీటీడీ బ్రేక్ దర్శనానికి అనుమతించింది. అటు తరువాత రెఫరల్ బ్రేక్ దర్శన టికెట్లు కలిగిన భక్తులను అనుమతించింది. దాదాపు గంటన్నర పాటు బ్రేక్ దర్శనం టికెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించింది. అటు తరువాత సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించింది.

ఉదయం 10 గంటలకు నైవేద్య విరామ దర్శన సమయం కావడంతో స్వామివారికి నివేదనలు సమర్పించి అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి శ్రీవాణి టికెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించింది. అనంతరం డోనర్స్ ని, టీటీడీ ఉద్యోగ, మాజీ ఉద్యోగుల కుటుంబ సభ్యులను దర్శనానికి అనుమతించింది. ఇక గురు, శుక్రవారాల్లో మాత్రం ఉదయం 8 గంటల నుంచి బ్రేక్ దర్శనాన్ని అమలు చేయనున్న టీటీడీ, మిగతా రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్నది. వేసవి సెలవుల నేపథ్యంలో రెండున్నర నెలల పాటు సిఫారసు లేఖల పై ఇచ్చే బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేయడంతో జూలై 15 వ తేది తరువాత నుంచి సిఫారసు లేఖల పై ఇచ్చే బ్రేక్ దర్శనం టికెట్లు కలిగిన భక్తులను రెఫరల్ ప్రోటోకాల్ అయిన అనంతరం ఉదయం 8 గంటల నుంచి అనుమతించనుంది

Tags:    

Similar News