ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి నీ దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీటీడీ..హిందువుల ఆస్తి అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా టీటీడీలో ఇతర మతస్తులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని...దీనిపై ఆలయ ఈవో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యాఖ్యల పై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం కూడా తెలిపారు.
ఈ క్రమంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రిస్టియన్ మతాన్ని అనురిస్తున్నట్లుగా విజిలెన్స్ విభాగం రిపోర్టు ఇవ్వడంతో మొత్తం నలుగురు ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సన్పెన్షన్ కు గురైన వారిలో నాణ్యతా విభాగ డిప్యూటీ ఇంజినీర్ బి.ఎలిజర్, స్టాఫ్ నర్సు ఎస్.రోసి, ఫార్మాసిస్ట్ లు ఎం.పేమావతి, జి . అసుంత ఉన్నారు. అయితే హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని అందుకే నలుగురు ఉద్యోగులపై వేటు వేసినట్లుగా తన సస్పెన్షన్ ఆర్డర్ లో ప్రస్తావించింది టీటీడీ.