TTD : బ్రహ్మోత్సవాల్లో భద్రతపై టీటీడీ విజిలెన్స్, పోలీసుల సమన్వయ సమావేశం

Update: 2025-09-18 10:17 GMT

సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసు, టీటీడీ అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో బుధవారం సాయంత్రం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్, శ్రీవారి వాహన సేవలలో వినియోగించే వివిధ వాహనాల పటిష్టత, అనుమానస్పద వ్యక్తులపై నిఘా వంటి అంశాలపై చర్చించారు.

• ట్రాఫిక్ అంతరాయం లేకుండా తిరుమల మరియు తిరుపతిలలో పార్కింగ్ లు ఏర్పాటు-

• ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు.

• ఎలక్ట్రికల్ కటౌట్లు, ఎల్ఈడీ స్క్రీన్ల పటిష్టత తనిఖీ.

• బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహన సేవలకు వినియోగించే వాహనాల స్థిరత్వం మరియు దృఢత్వం పరిశీలన.

• బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు విచ్చేసే కార్మికులు, ఆర్టీసీ డ్రైవర్ల గుర్తింపు తనిఖీ.

• అధిక రద్దీ నేపథ్యంలో ముందస్తుగా అదనపు వాహనాల పార్కింగ్ ఏర్పాటు పై ప్రణాళిక

• టీటీడీ నిఘా, జిల్లా పోలీసు, టిటిడి అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు

ఈ సమావేశంలో టీటీడీ సిఈ శ్రీ సత్య నారాయణ, తిరుమల అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ, టీటీడీ విభాగాధిపతులు, జిల్లా పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News