భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రా చలంలోని సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగిన దసరా ఉత్సవాల్లో గైర్హాజ రైన ఇద్దరు వైదిక పెద్దలకు ఆలయ ఈవో ఎల్ రమాదేవి మెమోలు జారీ చేశారు. రామాల యంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్త య్యే వరకు ఆలయ వైదిక పెద్దలు, అర్చకులకు, సిబ్బందికి ఎలాంటి సెలవులు ఇవ్వడం లేదని ఈవో ముందస్తుగానే ప్రకటించారు. అయితే దేవస్థానంలో పనిచేసే స్థానాచార్యులు స్థల సాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణ మాచార్యులు ఎటువంటి పర్మిషన్ లేకుండానే అధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా విధులకు గైర్హాజరయ్యారు. భద్రాచలంలో జరిగిన రామాయణ మహా పారాయణంలో వీరికి బదులుగా ఒక ప్రైవేటు వ్యక్తిని ఏర్పాటు చేసి అతనికి వీరి బాధ్యతను అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆలయ ఈఓ రమాదేవి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిద్దరికీ మెమోలు జారీ చేశారు.