Jatara : ఈ ఆది, సోమ వారాల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర

Update: 2024-07-19 05:17 GMT

ఆషాఢ మాసం బోనాల ఉత్స వాల సందర్భంగా ఈ నెల 21, 22 తేదీలలో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళీ జాతరను వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కోరారు.

గురువారం దేవాదాయ శాఖ రాష్ట్ర కార్యాలయంలో జోగినీలతో ప్రత్యేక సమావేశం జరిగింది. జోగినిలతో ప్రభుత్వం మొదటి సారి ఇటువంటి సమావేశాన్ని నిర్వహించడాన్ని ఆమె అభినందించారు. ప్రభుత్వం చేపట్టే చర్యలకు పూర్తిగా సహకరిస్తామని జోగినీలు ముక్త కంఠంతో అంగీకరించారు. లా అండ్ ఆర్డర్ కాపాడటం చాలా ముఖ్యమైనదని గమనించాలని జోగినిలకు సూచించారు. జోగినిలు, శివశక్తులతో పాటు గరిష్టంగా ఐదుగురిని అనుమతించనున్నట్లు తెలిపారు.

మహంకాళీ జాతరను ప్రశాంతంగా నిర్వహించ డంతో పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు, బోనాలు సమర్పణకు, బోనం తీసుకు వచ్చే జోగినీలు, శివశక్తులకు మధ్యాహ్నం 1.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు బాటా చౌరస్తా నుండి రావాలని సూచించారు. దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన బోనాలు జాతరలో జోగినిలు పాత్రను ప్రశంసించారు. ఫలహారం బండ్లను రాత్రి 12 గంటలకు క్లోజ్ చేయాలని చెప్పారు. మహంకాళీ జాతరను వైభవంగా నిర్వహించడానికి పటిష్టమైన బ్యారీకేడ్లు, తాగు నీటి వసతి, క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు.

Tags:    

Similar News