Union Minister Nitin Gadkari : శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

Update: 2025-08-02 08:15 GMT

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ…. దేశం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News