కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అక్టోబర్ 10వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు వెల్లడించారు.తిరుమల తరహాలో తొమ్మిది రోజుల పాటు వాహన సేవలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో వేలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, దానికి తగినట్లుగా ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనలతో ఇప్పటికే ఆలయం వద్ద కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.