Poleramma Jatara : జనసముద్రంగా మారిన వెంకటగిరి పోలేరమ్మ జాతర....

Update: 2025-09-12 10:11 GMT

వెంకటగిరి గ్రామశక్తివరూపిణి పోలేరమ్మ జాతర కన్నుల పండుగ ముగిసింది.పోలేరమ్మ అమ్మవారి ఊరేగింపు సందర్భంగా పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి గ్రామ ఉత్సవంలో ఇసుకేస్తే రాలని విధంగా భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి ఊరేగింపులో కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. పోలేరమ్మ గుడి నుండి అమ్మవారిని రథంపై పై ఉంచి రాజ వీధి మీదుగా శివాలయం నుండి మల్లమ్మ గుడి వీధిలోని అమ్మవారి నిష్క్రమణ వరకు సాగనంపారు. అశేషంగా తరలివచ్చిన మహిళ భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.లక్షలాదిమంది దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చేర్చుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలేరమ్మ జాతర ప్రశాంతంగా ముగిసింది.

Tags:    

Similar News