తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్ వివియస్ లక్ష్మన్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. దర్శన అనంతరం రంగనాయకమండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. పట్టు వస్త్రం తో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లడ్డు ప్రసాదం ఆరగించారు. తిరుమల శ్రీవారంటే తనకు అమితమైన భక్తి అన్నారు.