TTD : టీటీడీపై భూమన తప్పుడు ప్రచారం

Update: 2025-12-20 05:00 GMT

టీటీడీ మీద వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో అలిపిరికి సమీపంలో టీటీడీకి అరకిలో మీటర్ దగ్గరే ఒబెరాయ్ హోటల్ కు పర్మిషన్ ఇచ్చిన చరిత్ర వాళ్లదే. అప్పట్లో హిందూ సంఘాలు నిరసన చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని రద్దు చేశారు. ఇక అలిపిరికి ఐదు కిలోమీటర్ల దూరంలో, శేషాచలం కొండలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పర్యాటక శాఖకు కేటాయించింది ప్రస్తుత టీటీడీ బోర్డు. ఈ స్థలాన్ని కేవలం లీజుకు మాత్రమే ఇచ్చారు.

ఇక్కడ 20 ఎకరాల్లో స్వరా అనే హోటల్ నిర్మాణానికి పర్యాటక శాఖ లీజుకు ఇచ్చింది. కానీ భూమన మాత్రం ఇక్కడ ఎర్రచందనం చెట్లు భారీగా ఉన్నాయంటూ ఆయన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి ఎర్రచందనం చెట్లు లేవు. తిరుపతికి వెళ్తున్న రోడ్డుకు దగ్గర్లోనే ఈ స్థలం ఉంటుంది. కానీ భూమన మాత్రం దాన్ని మరోలా చెబుతున్నారు. ఇక్కడ ఆ భూమిని ఎవరికీ అప్పగించట్లేదు. కేవలం లీజుకు మాత్రమే ఇస్తున్నారు.

దీని వల్ల వందలాది మందికి ఉపాధి కూడా లభిస్తుంది. కానీ భూమన మాత్రం ఈ స్థలాన్ని ప్రైవేట్ హోటల్ కు రాసిచ్చేస్తున్నారని చెప్పడం ఆయనకే చెల్లింది. ఆయన హయాంలో టీటీడీలో ఎన్నో అవినీతి, అక్రమాలు జరిగినా సరే ఆయన వాటి గురించి మాట్లాడట్లేదు. కల్తీ నెయ్యి కేసు, పరకామణి, పట్టుశాలువాల లాంటి కుంభకోణాలు వైసీపీ హయాంలోనే జరిగాయి. కానీ ఇప్పుడు బీఆర్ నాయుడు గారు భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుతూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని చూసి ఓర్వలేకనే భూమన ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని భక్తులు అంటున్నారు.

Tags:    

Similar News