Allu Arjun : కోలీవుడ్ టాప్ ప్లేస్ కన్నేసిన అల్లు అర్జున్

Update: 2026-01-24 08:46 GMT

కోలీవుడ్ టాప్ ప్లేస్ కన్నేసిన అల్లు అర్జున్.. అనే మాట వినగానే ఏం అనిపించింది.. ? ఏం అనిపించిందో ఈ ఆర్టికల్ లో చూస్తే మీకు తెలుస్తుంది. తెలుగు, తమిళ్ మార్కెట్స్ పై ఒక క్లారిటీ ఉంది. అదేంటంటే.. టాప్ హీరోలు. ఈ విషయంలో కోలీవుడ్ లో కేవలం రజినీకాంత్ మాత్రమే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. తర్వాతి స్థానంలో ఉండే కమల్ హాసన్ సరైన సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్నాడు. సరే ఆ ఏజ్ గ్రూప్ ను కాస్త పక్కన పెడదాం. బట్ తెలుగు మార్కెట్ పరిస్థితి వేరే ఉంది కదా. చిరంజీవి, బాలకృష్ణ, వెంటకేష్ లు ఇప్పటికీ పెద్ద విజయాలు అందిస్తున్నారు. పైగా ఆయా హీరోల ఇమేజ్ ను నిలబెట్టుకుంటూ విజయాలు సాగిస్తున్నారు. ఈ విషయంలో నాగార్జున కాస్త రేస్ లో వెనకబడి ఉన్నాడు. బట్ అతను కూడా ట్రాక్ లోకి వచ్చే అవకాశాలున్నాయి. సో.. ఇది కాస్త అటూ ఇటూగా కమల్ అండ్ రజినీ ఏజ్ గ్రూప్ బ్యాచ్.

ఇక తర్వాతి రేస్ లో కోలీవుడ్ లో ఉన్న హీరోలు విజయ్, అజిత్ కుమార్. ఈ ఇద్దరికీ తిరులేని క్రేజ్ ఉంది. విజయ్ మాత్రం బిగ్గెస్ట్ హీరోగా సాగుతున్నాడు. తర్వాతి ప్లేస్ లో ఉన్నాడు అజిత్. ఆ తర్వాతి టైర్ ఒన్ హీరోలు అంటూ ఎవరూ లేరు. సూర్యకు ఆ ఛాన్స్ ఉంది. కానీ అతను హిట్ లు లేక ఇబ్బంది పడుతున్నాడు. సో.. టైర్ ఒన్ లేడు. ఇక ఆ తర్వాత హీరోలంతా టైర్ 2లోనే ఆగిపోయారు. మళ్లీ ఫస్ట్ ప్లేస్ కు వచ్చే అవకాశాలు మాత్రం ఇప్పట్లో వారికి కనిపిండం లేదు. ఇక విజయ్ ఇప్పటికి సినిమాల నుంచి తప్పుకుంటున్నాడు అని ప్రకటించడం తెలిసిందే. మిగిలింది అజిత్ మాత్రమే.

ఇటు తెలుగు నుంచి చూస్తే టైర్ 1 హీరోలు చాలామందే ఉన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. వీరంతా కాన్ స్టంట్ గా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉంది. భారీ విజయాలు అందుకుంటున్నారు. టైర్ 2 హీరోలు కూడా మన దగ్గర చాలామందే ఉన్నారు. వీళ్లు ప్రామిసింగ్ గా ఉన్నారు. టైర్ 3 కూడా ఉండటం బిగ్ ప్లస్ పాయింట్ మన దగ్గర.

తెలుగు నుంచి టైర్ 1 హీరోల్లో అల్లు అర్జున్ ఉన్నాడు కదా. మరి అతను ఎలా కోలీవుడ్ టాప్ ప్లేస్ ను ఎలా అందుకుంటాడు అనే డౌట్ వస్తుంది కదా. యస్ అక్కడికే వస్తున్నాం. ప్రస్తతం అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగుతో సమానంగా తమిళ్ మార్కెట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత లోకేష్ కనకరాజ్ మూవీ కూడా చేయబోతున్నాడు. ఇదో హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ లో సాగే సినిమా. ఇది కూడా భారీ స్థాయిలో తమిళ్ మార్కెట్ ఉండే అవకాశం ఉన్న మూవీ. ఇటు చూస్తే ఈ రెండు సినిమాలతో అల్లు అర్జున్ కోలీవుడ్ లోనే నెంబర్ వన్ ప్లేస్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా అతనికి తమిళ్ బాగా తెలుసు. మొదట చెన్నైలోనే పుట్టాడు. పెరిగాడు. ఆ కారణంగా తమిళ్ ఆడియన్స్ అల్లు అర్జున్ ను ఓన్ చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. అటు చూస్తే అజిత్ తర్వాత ఆ స్థానంలో నిలబడే తమిళ్ హీరో మరొకరు కనిపించడం లేదు. ఇంకా చెబితే అజిత్ కు ప్యాన్ ఇండియా ఇమేజ్ లేదు. ఈ కారణంగా ఈ రెండు తమిళ్ మూవీస్ తో అల్లు అర్జున్ ఆ స్థాయిలో తమిళ్ మార్కెట్ నిలబెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ. తమిళ్ మార్కెట్ నిలబెట్టుకోవడం అంటే తమిళ్ లో అతను నిలబడినట్టే కదా. ఆ కారణంగా అతనూ తమిళ్ ఆడియన్స్ కు ఓన్ చేయబడతాడు. ఆ కారణంగా తమిళ్ లో నెంబర్ వన్ ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఆ స్థానంలో నిలబడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే అతనూ అట్లీ, తర్వాత లోకేష్ కనకరాజ్ తో మూవీస్ చేస్తున్నాడు. తర్వాత మూవీస్ ను కూడా తమిళ్ డైరెక్టర్స్ అవకాశాలు కొట్టేస్తున్నా.. ఆ ఛాన్స్ అతనికీ దక్కుతుంది. ఎటొచ్చీ ఇప్పుడు మళయాలంలో టాప్ హీరో రేంజ్ లో అతని ఇమేజ్ ఉంది. కాకపోతే నెంబర్ వన్ హీరో స్థానం కష్టమే అవుతుంది. బట్ తమిళ్ లో మాత్రం అతనికి చాలా పెద్ద అవకాశం ఉంది. ఆ ఛాన్సెస్ ను నిలబెట్టుకునేలా సినిమాలుండాలి. అప్పుడే అతని కోలీవుడ్ నెంబర్ ప్లేస్ అనే కల నెరవేరుతుంది. ఎలాగూ తమిళ్ వాళ్లు టాప్ హీరోలుగా చేసిన వాళ్లంతా వేరే భాషలవాళ్లే కదా. ఆ అవకాశం అల్లు అర్జున్ కూ ఉంది. దాన్ని నిలబెట్టుకునే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయీ ఐకన్ స్టార్ లో. 

Tags:    

Similar News