AMBEDKAR: మన తరం బుద్దుడు..యుగానికొక్కడు.. అంబేద్కర్

నేడు మహానేత అంబేద్కర్ జయంతి

Update: 2026-04-14 03:30 GMT

డా­క్ట­ర్ భీమ్ రావ్ అం­బే­ద్క­ర్ భా­ర­త­దేశ సా­మా­జిక, రా­జ­కీయ, ఆర్థిక రం­గా­ల్లో వి­ప్ల­వా­త్మక మా­ర్పు­లు తీ­సు­కు­వ­చ్చిన మహా నేత. ఆయన జీ­వి­తం బడు­గు, బల­హీన, పేద వర్గాల హక్కుల కోసం సా­గిన ఒక ని­రం­తర పో­రా­ట­గాథ. అణ­గా­రిన వర్గా­ల­కు స్వా­భి­మా­నం కలి­గిం­చిన ఈ మహా­పు­రు­షు­డు భారత రా­జ్యాంగ ని­ర్మా­త­గా చరి­త్ర­లో చి­ర­స్థా­యి­గా ని­లి­చా­రు. ఇక కు­లాల పు­నా­దు­ల­ను తు­ద­కం­టా కద­ల్చా­ల­ని ఒక మహ­నీ­యు­డు  చె­ప్పిన నే­ల­పై అవే కు­లా­లు వె­య్యి అడు­గుల లోతు పు­నా­ది­పై దృ­ఢం­గా పా­తు­కు­ని­పో­తు­న్నా­యి. సమా­న­త్వా­న్ని జాతి జను­లు పా­డు­కు­నే గీ­తం­గా పరి­మ­ళిం­ప­జే­సే రా­జ్య వ్య­వ­స్థ­ను ఆయన కో­రు­కుం­టే, అస­మా­న­త­ల­కు ఆజ్యం పోసి నర­న­రా­నా కుల స్వ­భా­వా­న్ని, కు­లా­హం­కా­రా­న్ని, కు­ల­పీ­డ­న­ను జాతి గుం­డె­ల్లో ప్ర­తి­ష్టిం­ప­జే­సే పని­లో పా­ల­కు­లు ము­ని­గి పో­తు­న్నా­రు. పౌ­రుల గౌ­ర­వా­న్ని పెం­చే పా­ల­న­ను ఆయన కల­గం­టే పౌ­రుల సమ­స్త హక్కు­ల­నూ రక­ర­కాల ము­సు­గు­ల­తో తొ­క్కి­వే­సేం­దు­కు ప్ర­య­త్ని­స్తు­న్నా­రు. సకల జీవన రం­గా­ల్లో శా­స్త్రీయ దృ­క్ప­థా­న్ని పెం­పొం­దిం­చా­ల­ని ఆయన ఆశి­స్తే, ఆ భా­వ­న­నే రా­జ్యాం­గం­లోం­చి తొ­ల­గిం­చే­సా­హ­సా­ని­కి నేటి పా­ల­కు­లు పూ­ను­కుం­టు­న్నా­రు. 

ఆ పోరాటానికి ఏమివ్వగలం

బా­బా­సా­హె­బ్’గా ప్ర­సి­ద్ధి పొం­దిన భా­ర­త­ర­త్న డా­క్ట­ర్ బీ­ఆ­ర్ అం­బే­డ్క­ర్ దే­శం­లో­ని అణ­గా­రిన వర్గాల ఆర్థిక, సా­మా­జిక సా­ధి­కా­రి­క­త­కో­సం తన జీ­వి­తం చి­వ­రి వరకూ పో­రా­టం చే­శా­రు. రా­జ్యాంగ పరి­ష­త్తు సభ్యు­ని­గా అం­బే­డ్క­ర్ వి­శేష శ్ర­మ­కో­ర్చి రా­జ్యాంగ రచన చే­య­డం ఆయన జీ­వి­తం­లో ప్ర­ముఖ ఘట్టం. ధర్మ­శా­స్త్ర పం­డి­తు­డు, భారత రా­జ్యాంగ ని­ర్మాత, రా­జ­కీయ నేత, స్వం­తం­త్ర భారత తొలి న్యాయ మం­త్రి, జా­తీ­యో­ద్య­మం­లో తొలి దళిత నేత, వృ­త్తి రీ­త్యా లా­య­రు, బౌ­ద్ధు­డు, తత్వ­వే­త్త, మా­న­వ­శా­స్త్ర అధ్య­య­న­క­ర్త, చరి­త్ర­కా­రు­డు, ప్ర­సం­గి­కు­డు, రచ­యిత, అర్థి­క­వే­త్త, పం­డి­తు­డు, సం­పా­ద­కు­డు, వి­ప్ల­వ­కా­రు­డు, బౌ­ద్ధ ధర్మ పు­న­రు­ద్ధ­ర­ణ­క­ర్త ఇలా ఆ మహ­నీ­యు­డి గు­రిం­చి ఎంత చె­ప్పు­కు­న్నా తక్కు­వే. బా­ల్యం­లో అడు­గ­డు­గు­నా ఛీ­త్కా­రా­లు, ఎన్నో అవ­మా­నా­ల­కు గు­ర­యి.. పే­ద­రి­కా­న్ని ఎదు­ర్కొం­టూ స్వ­యం­కృ­షి, స్వీ­య­ప్ర­తి­భ­తో ఎది­గి స్వ­తం­త్ర భా­ర­తా­ని­కి తొలి కేం­ద్ర మం­త్రి పద­వి­ని అలం­క­రిం­చే­స్థా­యి­కి అం­బే­ద్క­ర్ చే­రు­కు­న్నా­రు. తన జీ­వి­తాం­తం అణ­గా­రి­వ­ర్గాల గొం­తు­క­ను వి­ని­పిం­చి, వారి సా­ధి­కా­రి­క­త­కు అం­బే­డ్క­ర్ పా­టు­ప­డ్డా­రు. కొ­లం­బి­యా వర్సి­టీ, లం­డ­న్ స్కూ­ల్ ఆఫ్ ఎక­న­మి­క్స్ నుం­చి అర్ధ­శా­స్త్రం­లో గౌరవ డా­క్ట­రే­ట్లు, అలా­గే, ప్ర­పంచ ప్ర­ఖ్యాత వి­ద్యా సం­స్థ­ల్లో న్యాయ, ఆర్ధిక, రా­జ­కీయ శా­స్త్రా­ల్లో పరి­శో­ధ­న­లు చే­శా­రు. వి­ద్యా­భ్యా­సం తర్వాత ఆర్ధి­క­వే­త్త­గా, ప్రొ­ఫె­స­ర్‌­గా, న్యా­య­వా­ది­గా పలు పా­త్ర­లు పో­షిం­చా­రు. తరు­వాత జా­తీ­యో­ద్య­మం­లో­కి వచ్చా­రు. స్వా­తం­త్రం సి­ద్ధిం­చిన తర్వాత దళి­తుల రా­జ­కీయ హక్కు­లు, సా­మా­జిక స్వే­చ్ఛ కోసం పని­చే­శా­రు. రా­జ్యాంగ రచనా కమి­టీ అధ్య­క్షు­డి­గా సే­వ­లం­దిం­చి ప్ర­పం­చం­లో­నే అత్యు­త్తమ రా­జ్యాం­గం తయా­రీ­లో కీలక పా­త్ర పో­షిం­చా­రు.

జీవితాంతం పోరాటమే

జీ­వి­తాం­తం అణ­గా­రి వర్గాల కోసం పో­రా­డి, వా­రి­కి ఆశా­జ్యో­తి­గా ని­లి­చా­రు. తన జీ­విత చర­మాం­కం­లో బౌ­ద్ధ మతా­న్ని స్వీ­క­రిం­చా­రు. గౌతమ బు­ద్దు­ని బో­ధ­న­ల­కు ప్ర­భా­వి­త­మైన అం­బే­డ్క­ర్.. బౌ­ద్ధు­డి­గా మా­రా­రు. అం­ట­రా­ని­త­నం­పై ఆయన పూ­రిం­చిన సమర శంఖం నే­టి­కీ ని­ప్పు కణి­క­లా జ్వ­లి­స్తూ­నే ఉంది. దళి­తు­లు, మహి­ళ­లు, కా­ర్మి­కుల హక్కుల కోసం అలు­పె­రు­గ­ని పో­రా­టం చే­సిన యో­ధు­డా­యన. కుల, మత రహిత ఆధు­నిక భా­ర­తా­వ­ని­కి కోసం అం­బే­ద్క­ర్‌ తన జీ­వి­త­కా­లం పో­రా­టం చే­శా­రు. దళి­తుల నాటి సమా­జం­లో ఉన్న వి­వ­క్ష­ను పా­ర­ద్రో­ల­డా­ని­కి అం­బే­ద్క­ర్‌ చే­సిన పో­రా­టం మరు­వ­లే­ని­ది. అం­ట­రా­ని­త­నం గు­రిం­చి ఆయన చే­సిన పో­రా­టం చరి­త్ర­లో చి­ర­స్థా­యి­గా ని­లి­చి­పో­యిం­ది. బడు­గు, బల­హీ­న­వ­ర్గా­ల­ను దగ్గర నుం­చి చూ­సిన వ్య­క్తి­గా అం­బే­డ్క­ర్.. వారి అభ్యు­న్న­త­కి రా­జ్యాం­గం­లో రి­జ­ర్వే­ష­న్ల అం­శా­న్ని చే­ర్చి వారి జీ­వి­తా­ల్లో కొ­త్త వె­లు­గు­లు నిం­పా­రు. అలా­గే అం­ట­రా­ని­త­నం, అస్పృ­శ్య­త­ను శి­క్షా­ర్హ­మైన నే­రం­గా చే­శా­రు. ఆర్థి­క­వే­త్త­గా కూడా ఎంతో గు­ర్తిం­పు పొం­దా­రు. భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ చిత్రపటంపై అంబేద్కర్‌ చెరిగిపోని సంతకం అనేది నిర్వివాదాంశం. ఆయన ఆధునిక భారత నిర్మాణంలో కీలకమైన వ్యక్తి. అంబేద్కర్‌కు భారతదేశ ప్రాచీన చరిత్ర పట్ల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. దీనితోపాటు ఆయా వ్యవస్థల అభివృద్ధి విషయంలో తనదైన దృష్టికోణం ఉందనేది అంబేద్కర్‌ రచనలు, ఆయన చేసిన ప్రసంగాలు అధ్యయనం చేసిన వారికి అర్థమవుతుంది. ఆయన రాజకీయాల గురించి రాసినా, సామాజిక అంశాలను విశ్లేషించినా, చివరకు సాహిత్యంపై మాట్లాడినా అన్నింటిలోనూ సాధికారమైన జ్ఞానంతోపాటు.. ఆయా రంగాలలో ప్రజాస్వామిక విలువల్ని సాధించడానికి ఆయన పడిన తపన స్పష్టంగా కనిపిస్తుంది.

Tags:    

Similar News