Pawan Kalyan Son : మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రముఖుల గుడ్ విష్

Update: 2025-04-09 13:00 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్ిర పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్‌ శంకర్‌ అగ్నిప్రమాద గాయాల నుంచి త్వరగా కోలుకోవాలంటూ పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు గుడ్ విషెస్ తో సోషల్ మీడియాలో స్పందించారు. ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మార్క్‌ శంకర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడని పవన్‌ తెలిపారు. తన కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎంతో మంది మంచి మనస్సుతో ఆశీస్సులు అందించడంతో క్రమంగా కోలుకుంటున్నాడని తెలిపారు. ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ పవన్‌ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

Tags:    

Similar News