Dhanashree Posts : చాహల్‌తో విడాకుల ప్రచారం.. ఇన్‌స్టాలో ధనశ్రీ పోస్ట్

Update: 2025-01-09 07:30 GMT

చాహల్‌తో విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో ధనశ్రీ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఫ్యామిలీతో పాటు తాను కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నానని అన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వస్తున్న నిరాధార కథనాలు బాధిస్తున్నాయని తెలిపారు. కొన్ని ఏళ్లపాటు కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నట్లు పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి వాస్తవంపై దృష్టి పెట్టి ముందుకెళ్తానని పేర్కొన్నారు.

టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధనశ్రీతో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌ సన్నిహితంగా దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతీక్ స్పందించారు. ‘ఎవరికైనా తమకు నచ్చిన కథలు, కథనాలు చెప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఉంది. కానీ ఒక చిన్న ఫొటోను వేరేవిధంగా చూడడం దారుణం. అబ్బాయిలూ ఎదగండి’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Tags:    

Similar News