Gold Prices : మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

Update: 2025-03-08 10:56 GMT

వరుసగా రెండు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.80,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 పెరగడంతో రూ.87,710లకు చేరింది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.1,08,100 వద్ద కొనసాగుతోంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.

ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, విజయవాడలో ఒక గ్రాము ధర రూ. 8,771 గానూ, 8 గ్రాముల ధర రూ. 70,168 గానూ ఉంది. 10 గ్రాముల ధర రూ. 87,710 గానూ ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఈరోజు 10 గ్రాముల ధర రూ. 550 పెరిగింది.

విజయవాడలో వెండి విషయానికి వస్తే ఒక గ్రాము ధర (Today Silver Price) రూ. 108.10 గానూ, 8 గ్రాముల వెండి ధర రూ. 864.80 గానూ ఉంది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 1,081 గానూ ఉంది. నిన్నటి ధరలతో పోల్చితే కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ. 1,08,100 గానే ఉంది.

Tags:    

Similar News