Telugu States CMs : తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంల హోలి విషెస్

Update: 2025-03-14 06:00 GMT

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని రేవంత్ అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే ఈ పండుగ సమైక్యతకు అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త రంగులు నింపాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించవద్దని సూచించారు.

హోలి అంటేనే రంగుల పండుగ. కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం. కృత్రిమ రంగులు కాకుండా ఆర్గానిక్ రంగులను ఉపయోగించేలా చూడండి. శరీరానికి నూనె అప్లై చేయడం ద్వారా రంగులను త్వరగా శుభ్రం చేసుకోవచ్చు. రంగులు శరీరంపై పడకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి. చెరువులు కాలువలు, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి.

హోళీ రంగులు పోవాలంటే ఇలా చేయండి

బయటకు వెళ్లే ముందు పెట్రోలియం జెల్లీ లేదా నూనె రాసుకుంటే లేయర్‌లా కాపాడుతుంది

– రంగులు పడ్డాక వీలైనంత త్వరగా నీటితో కడుక్కోండి

– చేతికి హానికర కెమికల్ కలర్స్ అంటితే సీ సాల్ట్, గ్లిజరిన్, ఆల్మండ్ ఆయిల్‌తో రుద్దండి

– రంగులు చల్లుకున్నాక నేరుగా షాంపూతో తలను శుభ్రం చేయకుండా ముందుగా నీళ్లతో కడగండి

– పెరుగు, నిమ్మరసం కలిపి రంగులు బాగా అంటిన చోట రుద్ది గోరువెచ్చని నీటితో స్నానం చేయండి

Tags:    

Similar News