CRPF Jawan : భార్యతో మాట్లాడుతూ.. గన్‌తో కాల్చుకున్న జవాన్

Update: 2025-07-15 13:45 GMT

ఓ జవాన్ తన భార్యతో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం శివపురంకొట్టాలకు చెందిన మురళి, 2017లో సీఆర్‌పీఎఫ్‌లో చేరారు. ప్రస్తుతం అతడు ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ సమీపంలోని 65వ బెటాలియన్‌ క్యాంపులో పనిచేస్తున్నాడు. అనంతపురానికి చెందిన పావని అనే యువతిని ప్రేమించి, ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మురళి తండ్రికి స్కిన్ క్యాన్సర్ ఉండడంతో బెంగళూరులో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స సాగుతోంది. ఇందుకోసం ఆయన రూ.30 లక్షల దాకా అప్పు చేశారు. ఈ నేపథ్యంలో చెల్లి పెళ్లి బాధ్యత, పిల్లల భవిష్యత్తు, కుటుంబ భాద్యతలు మురళిపై తీవ్ర ఒత్తిడిగా మారాయి.

ఈ క్రమంలోనే భార్యకు ఫోన్ చేసిన మురళి.. ‘‘చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. పిల్లలను బాగా చదివించాలి. ఇప్పటివరకూ రూ.34 లక్షలు అప్పు చేశా.. నువ్వే ఇప్పుడు కుటుంబానికి అండగా ఉండాలి’’ అని అన్నాడు. ఆ వెంటనే తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Tags:    

Similar News