రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారతీయ విద్యార్థిని నీలమ్ శిండే తండ్రికి వీసాపై అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇవాళ ఆయన వీసా ఇంటర్వ్యూకు అవకాశం కల్పించింది. కాలిఫోర్నియా వర్సిటీలో పీజీ చేస్తున్న నీలమ్‌ను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఆమె తండ్రి వీసాకు అప్లై చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని NCP ఎంపీ సుప్రియ కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా విదేశాంగ శాఖ అమెరికాతో చర్చించింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు నీలమ్ శిండే (35) అనే విద్యార్థిని కాలిఫోర్నియా యూనివర్శిటీలోని పీజీ చేస్తోంది. అయితే ఫిబ్రవరి 14న ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు ఢీకోనడంతో ఆమె తల, ఛాతి భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది. ఫిబ్రవరి 16న నీలమ్ శిండే కుటుంబానికి ఈ విషయం తెలిసింది. దీంతో ఆమె తండ్రి వెంటనే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది.