RRR Effect: జగన్ వైసీపి శాశ్వత అధ్యక్షుడు కాదని తేల్చిన వైఎస్ఆర్సీపీ
ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చిన జగన్ పార్టీ;
వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎంపీ రఘరామ కృష్ణంరాజు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీని వివవరణ కోరగా తమ పార్టీ పేరు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ కాదని స్పష్టం చేసింది. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వెల్లడించింది. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీగా కానీ, వై ఎస్ ఆర్ సిపి గా కానీ మార్చే ప్రతిపాదన, ఆలోచన కూడా లేదని తెటతెల్లం చేసింది. అంతేకాదు. వైఎస్ జగన్ వైసీపి శాశ్వత అధ్యక్షుడు కాదని, అసలు అలాంటి తీర్మానం ఎప్పుడూ చేయలేదని ఎన్నికల కమిషన్ కు వెల్లడించింది. జగన్ పార్టీ ఇచ్చిన వివరణను కేంద్ర ఎన్నికల సంఘం ఎంపీ రఘురామకు తెలియపరిచింది.