సమ్మర్ లో చల్లని ప్రదేశంలో ఉండటం మంచిదే. ఐతే.. మరీ ఎక్కువ కూలింగ్ కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏసీలు, కూలర్ల ముందే గడుపుతుంటారు. అయితే, చిన్న పిల్లలకు ఎయిర్ కండీషనర్ ఎయిర్ మంచిదేనా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది.
చిన్న పిల్లలకు ఎయిర్ కండీషనర్ వాడటం ఎంతవరకు సురక్షితం అనేదానిపై నిపుణులు కొన్నిసూచనలు చేస్తున్నారు. పిల్లలు, శిశువును చల్లని ఏసీ గాలిలో ఉంచవచ్చు. ఈ గాలి పిల్లలకు పూర్తిగా ప్రమాదకరం కాదు. కానీ కొన్నిసార్లు చల్లటి గాలులు.. పిల్లలో సర్ది, దగ్గుకు కారణం కావచ్చు. కాబట్టి టెంపరేచర్ మార్చుతూ ఉంటుంది. ఆన్ ఆఫ్ పాటిస్తూ ఉండండి.
ఏసీ, కూలర్ ముందు శిశువులు, పిల్లలను పడుకోబెడితే.. వారికి నిండుగా దుప్పటి కప్పండి. ఏసీ నుంచి వచ్చే రేణువులు పిల్లల ముక్కుల్లోకి పోకుండా రక్షణగా ఉంటుంది.