Heart Attack: గుండెపై ఒత్తిడిని తగ్గించే పండు.. రోజుకు ఒకటి..

Heart Attack:;

Update: 2021-10-27 02:30 GMT

Heart Attack: మారుతున్న జీవన శైలి, తీసుకుంటున్న ఆహారం గుండెపై ఒత్తిడిని పెంచుతోంది. శరీరానికి తగిన వ్యాయామం, మంచి ఆహారం గుండె పని తీరును మెరుగుపరుస్తుంది. పూర్వకాలంలో గుండె జబ్బులు వయసు మీద పడిన వారిని మాత్రమే బాధించేవి. కానీ ప్రస్తుత రోజుల్లో వయసుతో పన్లేదు. యువతీ యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు రోజుకో అరటి పండు తింటే గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించొచ్చని అంటున్నారు.



 మిగతా పండ్లలో కంటే అరటి పండులో పోషకాలు ఎక్కువ. విటమిన్లు, ఐరన్, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి ఉంటాయి. శరీరం నీరసంగా, అలసటగా అనిపించినప్పుడు కూడా ఒక అరటి పండు తింటే తక్షణ శక్తి వస్తుంది. అరటిపండులో ఉండే పొటాషియం గుండె ధమనులు మూసుకుపోకుండా చేస్తుంది. నిత్యం ఒక అరటి పండు తింటే శరీరానికి కావలసిన 9 శాతం పొటాషియం లభిస్తుంది. అరటి పండు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీంతో హృదయనాళ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.

Tags:    

Similar News