Healthy Spine: మహిళలను వేధించే వెన్నునొప్పి.. నివారణ మార్గాలు..

Healthy Spine: వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు వెన్నునొప్పితో ఇబ్బంది పడుతుంటారు.. కింద కూర్చోవడానికి, నాలుగు అడుగులు వేసి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.

Update: 2022-05-14 05:30 GMT

Healthy Spine: మొత్తం శరీర కదలిక మరియు నిర్మాణానికి వెన్నెముక కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణ జీవనశైలిలో మార్పులు వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

వెన్నెముక మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ యొక్క బహుళ భాగాలను కలుపుతూ నిటారుగా నిలబడటానికి, నడవడానికి, కూర్చోవడానికి లేదా వంగడానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా మహిళలు వెన్నెముక సమస్యలకు ఎక్కువగా గురవుతారు. ఎక్కువగా, గర్భధారణకు ముందు మరియు తర్వాత హార్మోన్ల మార్పులు, బరువు హెచ్చుతగ్గులు, ఎముక బలహీనపడడం, పీరియడ్స్ మహిళల్లో వెన్నెముక సమస్యలను పెంచుతుంది. ముఖ్యంగా వయసు పెరుగుతున్నకొద్దీ ఇది మరింత ఎక్కువ అవుతుంది.

ముఖ్యంగా మహిళల్లో వెన్ను సమస్యలను పెంచే కొన్ని అంశాలు

గర్భం: మహిళలు గర్భధారణ సమయంలో మరియు ప్రసవానంతర కాలంలో తమ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ప్రారంభమవుతుంది. దీంతో శారీరక, మానసిక సమస్యలతో సహా పలు మార్పులు సంభవిస్తాయి. వెన్నునొప్పి అనేది ఒక సాధారణ గర్భధారణ లక్షణం. గర్భధారణకు ముందు తర్వాత బరువు పెరగడం, పెల్విస్ ప్రాంతంలో మార్పులు వెన్నునొప్పికి కారణమవుతాయి. గర్భం దాల్చిన తర్వాత బరువు పెరగడంతో స్త్రీలలో వెన్ను సమస్యలు తీవ్రమవుతాయి.

వయస్సు: మహిళలు సాధారణంగా 50 లేదా 60 లలో రుతుచక్రం ఆగిపోతుంది. దీంతో వారి ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో వెన్నునొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

వైద్య పరిస్థితులు: అనేక మంది స్త్రీలు జననేంద్రియ రుగ్మతలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఋతు చక్రాల సమయంలో వెన్నునొప్పికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సాధారణంగా, ఊబకాయం అనవసరమైన ఒత్తిడి వెన్నెముక కండరాలు బలహీనపడటానికి కారణమవుతుంది.

చాలా వరకు, సాధారణ జీవనశైలి మార్పులు ఎముక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి:

సరైన ఆహారం తీసుకుంటూ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి: దీర్ఘకాలిక వెన్నునొప్పిని నివారించడానికి తృణధాన్యాలు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అలాగే, పెరుగు, పాలు వంటి పదార్ధాలు కాల్షియం కారకాలు.. ఇది ఎముకలను బలపరిచే ఆహారాలు. ఇవి ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి ఆహారంతో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

మహిళలు వయస్సు పెరిగే కొద్దీ సాధారణ ఎముక సంబంధిత వ్యాధులను నివారించవచ్చు. నీరు కూడా మీ వెయిట్ ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది.. 20 కేజీలకు లీటర్ చొప్పున 40కేజీలు ఉంటే 2 లీటర్లు, 60 ఉంటే 3 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. నీరు తీసుకోవడం వల్ల స్లిప్ డిస్క్ ప్రమాదాలను తగ్గిస్తుంది.

జీవనశైలి: ఇంట్లో లేదా కార్యాలయంలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్ను కండరాలు బిగుసుకుపోయి వెన్నునొప్పి తీవ్రతరం అవుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే కొన్ని వెన్నుపూసను బలపరిచే వ్యాయామాలను చేయడం వల్ల వెన్నెముకపై మొత్తం భారాన్ని తగ్గించవచ్చు. వెన్నెముక గాయాలను నివారించవచ్చు.

సరైన భంగిమ: సాధారణంగా, నిలబడి లేదా కూర్చున్నప్పుడు నిటారుగా ఉండే భంగిమను నిర్వహించడం వలన వెన్ను సమస్యలను నివారించవచ్చు. అదేవిధంగా, వ్యాయామం చేసేటప్పుడు లేదా సాధారణంగా అధిక బరువులు ఎత్తేటప్పుడు వెనుక కండరాలపై భారం పడుతుంది. కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

గమనిక: వెన్ను సమస్యలకు సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్స పొందడం చాలా కీలకం. ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది.. ఇది వైద్యుని సూచలు, సలహాలకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు. 

Tags:    

Similar News