Skin Care : దానిమ్మ తొక్కలను తీసిపారేస్తున్నారా..? వాటితో ఇలా చేస్తే మెరిసిపోతారు

Update: 2025-03-10 12:00 GMT

దానిమ్మ ఆరోగ్యానికి మాత్రమే కాదు..అందాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని మీరు నమ్ముతారా? అవును. ఇది తినడానికి మాత్రమే కాకుండా ఫేషియల్ స్క్రబ్‌గా ఉపయోగిస్తే కూడా గొప్ప ప్రయోజనాల అందుతాయి. దానిమ్మపండులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. పండు మాత్రమే కాదు, దాని తొక్క, బెరడు, పువ్వులు మొదలైన అన్ని భాగాలు పోషకాలతో పాటు ఔషధ విలువలను కలిగి ఉంటాయి. సరైన పద్ధతుల్లో వాడితే చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలు కూడా తగ్గుతాయి. మరి ఈ పండును ఎలా ఉపయోగించాలి? స్క్రబ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

సాధారణంగా మీరు ఎంత అందంగా ఉన్నా.. మీ ముఖం మీద నల్లటి మచ్చలు ఉంటే అవి మీ అందాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ముఖాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారు దానిమ్మ తొక్కలను ఉపయోగించి ఇంట్లోనే అద్భుతమైన ఫేషియల్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. ఈ స్క్రబ్​ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల నల్లటి మచ్చలు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం నుండి మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ స్క్రబ్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి. చర్మం తన మెరుపును కోల్పోవడానికి ఈ మృత కణాలే కారణం. అందుకే దానిమ్మ తొక్కను సరిగ్గా వాడితే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News