Pre-Wedding Diet Plan: ట్రెండ్ మారింది.. తెరపైకి ప్రీ వెడ్డింగ్ డైట్ ప్లాన్..

Pre-Wedding Diet Plan: జీవితంలో సంతోషకరమైన రోజు పెళ్లి.. ఆ రోజు కోసం ప్రతి ఆడపిల్ల ఆత్రంగా ఎదురు చూస్తుంది.

Update: 2022-05-13 10:30 GMT

Pre-Wedding Diet Plan: జీవితంలో సంతోషకరమైన రోజు పెళ్లి.. ఆ రోజు కోసం ప్రతి ఆడపిల్ల ఆత్రంగా ఎదురు చూస్తుంది. కాబోయే వరుడికి అందంగా కనిపించాలని ఆశపడుతుంది. పెళ్లి షాపింగ్ పేరుతో సమయానికి తినకపోవడం లేదా ఏదో ఒకటి తినడం చేస్తుంటారు.. ఇదంతా ఆరోగ్యంపై, అందంపై కూడా ప్రభావం చూపుతుంది.

మీరు తీసుకునే డైట్ ఆరోగ్యకరమైనది అయి ఉండాలి. అలాగే, మీరు స్త్రీగా అత్యంత అందమైన దశలోకి ప్రవేశించేటప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం అలవరుచుకోవాలి.

కాబోయే వధువు కోసం ఏడు చిట్కాలు:

ప్రతిరోజూ రాత్రి 7.30 గంటలకు ముందే మీ డిన్నర్ ముగించండి.

రోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. మీ రోజువారీ షెడ్యూల్‌లో 30 నిమిషాలు నడకకు కేటాయించండి.

మినీ-మీల్ పాలసీని అనుసరించండి. ప్రతి 3 గంటలకు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోండి.

రోజూ 8-10 గ్లాసుల నీటిని తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి.

చక్కెర లేకుండా నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు, ఎక్కువ నీరు ఉన్న పండ్లు, వెజిటబుల్ జ్యూస్ వంటివి కూడా తాగవచ్చు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం వలన టాక్సిన్స్‌ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గోర్లు, జుట్టుకు తగిన పోషణ అందుతుంది. నీరు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

మీ ప్లేట్ పోషకారంతో నిండి ఉండాలి.

మీ ఆహారంలో గోధుమలు, రాగులు, ఓట్స్, బ్రౌన్ బ్రెడ్ వంటి సంక్లిష్ట పిండి పదార్థాలు, ఆకుపచ్చని కూరగాయలను జోడించండి.

మైదా, చక్కెర, బాగా పాలిష్ పట్టిన బియ్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.

బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చియా గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటి గింజల్లో ఒమేగా 3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

మీ భోజనంలో భాగంగా యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఆకు కూరలను తినండి.

క్యారెట్, దోసకాయ, టమోటా వంటి పచ్చి కూరగాయలను సలాడ్ రూపంలో చేర్చండి. ఈ కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

మెరిసే చర్మం కోసం

ఉదయం మేల్కొన్న 5-10 నిమిషాలలో ఒక పండు తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ చర్మానికి నిగారింపును తెస్తుంది.

బ్యాచిలర్ పార్టీలో కూడా అలెర్ట్ గా ఉండండి. ఆరోగ్యకరమైన మెనూని ప్లాన్ చేయండి.

అన్నింటికంటే ముఖ్యంగా సంతోషంగా ఉండండి. ఒత్తిడికి గురికాకండి. చివరి నిమిషంలో జరిగే పనులతో వివాహ సమయంలో ఒత్తిడికి గురవుతారు.. అన్నీ ముందుగా, ప్రశాంతంగా ప్లాన్ చేసుకోండి.. మీ వివాహ వేడుక మీకు మధురానుభూతులను మిగల్చాలి. 

Tags:    

Similar News