మారిన ఫుడ్ హ్యాబిట్స్ తో చాలామంది జుట్టు చిన్న ఏజ్ లోనే తెల్లబడుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధ పడుతున్నారు. ఎవరిని చూసిన రంగులు వేస్తూ కనిపిస్తున్నారు. కానీ దీని వల్ల సమస్యలు కూడా రావచ్చు.
పాతికేండ్లు నిండకుండానే జుట్టు నెరిసిపోవడం సమస్యనే. సరైన పోషకాలు, విటమిన్లు లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఇక ఈ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. జుట్టు నెరవడం అంటే హృద్రోగానికి సంకేతం అంటారు నిపుణులు.
ఈజిప్ట్ లోని కైరో యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందట. ఇందులో ఏకంగా 545 మందిని ఎంపిక చేశారు. వాళ్ల ఆరోగ్యం, జుట్టు రంగు ఆధారంగా పరిశీలించారు నిపుణులు. అందరికీ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారట. తెల్ల జుట్టు ఉన్నవారిలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు తెలుసుకున్నారట. సో.. తీసుకునే ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించండి.