వారానికి ఒక రోజు 12 గంటల పాటు ఉపవాసం ఉండే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బరువు తగ్గాలని తపన పడే నేటి తరానికి చక్కని ఆప్షన్. ఇందుకోసం కొన్ని కచ్చితమైన నియమాలు పాటించాలి. అప్పుడే తగిన ఫలం దక్కుతుంది. ఏడు రోజుల్లో మొత్తంగా రెండు దఫాల్లో 16 గంటల పాటు ఉపవాసం ఉండే 16/8 ఉపవాస పద్ధ ఇది. దీన్లో ఉదయం 8 గంటలకు బ్లాక్ కాఫీ తాగ వచ్చు.
రాత్రి నుంచి మధ్యాహ్నం వరకూ ఉపవాసం ఉండే ఈ విండో పీరియడ్లో పాలు, చక్కెర చేర్చని బ్లాక్ కాఫీ, నీళ్లు తాగవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు పీచు ఎక్కువగా ఉండే కూరగాయలతో, చికెన్ సలాడ్ లాంటి ప్రొటీన్ ఫుడ్తో కూడిన ఆరోగ్యవంతమైన భోజనం చేయాలి.
మధ్యాహ్నం మూడు గంటలకు గ్రీక్ యోగర్డ్ లేదా బెర్రీ పళ్లు తినవచ్చు. రాత్రి 8 గంటలకు విండో పీరియడ్ ముగుస్తుంది. కాబట్టి రాత్రి భోజనం 7 గంటలకే మొదలుపెట్టాలి. రాత్రి 8 గంటల తర్వాత ఎలాంటి ఆహారమూ తీసు కోకూడదు. అవసరమైతే నీళ్లు తాగవచ్చు.
ఉపయోగాలు:
Iనాడీకణాల క్షీణతకు కారణమయ్యే వ్యాధుల నుంచి రక్షణ దొరుకుతుంది.
ఇన్సులిన్ స్థాయులు తగ్గి, గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది.
గుండె జబ్బులు దరి చేరవు.
రక్తపోటు, కొలెస్ట్రాల్లు పెరగవు. కొవ్వు కరిగేలా మెటబాలిజం పెరుగుతుంది.