యోగాసనాల అనేక మానసిక శారీరక సమస్యలను తగ్గిస్తాయి. ప్రతి రోజూ కొంచెంసేపు వీటిని సాధన చేయడం వల్ల ఆందోళన తగ్గి విశ్రాంతి లభిస్తుంది. కండరాలు, అంతర్గత అవయవాల పనితీరు మెరుగవడమేకాక, ఆర్యోకరమైనరీతిలో బరువు తగ్గడానికి కూడా యోగాసనాలు ఉపయోగ పడతాయి. బరువు తగ్గడానికి సాధన చేయవలసిన ఐదు యోగాసనాలను తెలుసుకుందాం.
వజ్రాసనం : చాలా ఆసనాలకు ఈ ఆసనం మూల భంగిమ. దీన్ని సాధన చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. తొడలు పిరుదుల భాగంలో చేరిన కొవ్వు కరుగుతుంది.
ధనురాసనం : ఈ ఆసనం వంచిన విల్లులా ఉంటుంది. దీన్ని సాధన చేయడం వల్ల పొత్తి కడుపు బిగుతుగా మారి ఆ ప్రాంతంలో పేరుకున్న కొవ్వు కరుగుతుంది.
చతురంగ దండాసనం : చతురంగ దండాసనం చేయడంవల్ల మొత్తం శరీరంలో కదలిక, ఒత్తిడి కలుగుతాయి. ముఖ్యంగా చేతులు, ఛాతీ మరియు పొట్ట ప్రాంతం బిగుసుకు పోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో కొవ్వు కరుగుతుంది.
వీర భద్రాసనం : ఇది యుధ్దానికి సిధ్దమైన యోధుని భంగిమలా ఉంటుంది. దీన్ని సాధన చేసేటపుడు తొడ మరియు తుంటి భాగాలపై ఒత్తిడి పడటంతో, ఆయా ప్రాంతాల్లో పేరుకున్న అధిక కొవ్వు కరుగుతుంది,
సేతు బంధాసనం : ఇది వంతెనలాగా కనిపించే భంగిమ. దీన్ని సాధన చేయడం వల్ల నాడీ వ్యవస్థబలంగా మారుతుంది. వెన్నునొప్పి సయాటికాల నుండి ఉపశమనం లభించడమేకాక నడుము , పిరుదుల చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.