పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 125 మంది మృతి
పాకిస్థాన్‌ను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి.;
పాకిస్థాన్‌ను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక నగరాలు జలమయమయ్యాయి. అలుపెరగని వర్షాలతో దేశవ్యాప్తంగా ఈ ఏడాది 125 మంది మృతి చెందారు. రుతుపవనాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో 43 మంది, సింధ్‌లో 34 మంది, బలూచిస్తాన్‌లో 17 మంది, పంజాబ్‌లో 14 మంది, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో 11 మంది మృతి చెందారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మృతులలో భారీ సంఖ్యలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నట్టు తెలిపారు.