ఘోర ప్రమాదం.. ట్రక్కు బోల్తా.. 16 మంది కూలీలు దుర్మరణం

. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో మొత్తం 21 మంది కార్మికులు ఉన్నారు.;

Update: 2021-02-15 12:00 GMT

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరటి లోడుతో వెళ్తున్న ట్రక్కు జల్లావ్ జిల్లాలోని కింగ్వాన్ వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 16 మంది కూలీలు స్పాట్ లోనే మృతిచెందారు. మహారాష్ట్రలోని ధూలే నుంచి రేవర్ ప్రాంతానికి కూలీలను తీసుకుని అరటి లోడుతో ప్రయాణిస్తున్న ట్రక్కు ఆదివారం అర్థరాత్రి దాటాక ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో మొత్తం 21 మంది కార్మికులు ఉన్నారు. మృతులంతా అభోదా, కర్హలా, రావేరా జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.


Tags:    

Similar News