హిమాచల్‌ప్రదేశ్‌లో భూ ప్రకంపనలు

దేశంలో పలు ప్రాంతాలల్లో వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతదేశాల్లో తరచూ భూకంపాలు

Update: 2020-09-19 05:08 GMT

దేశంలో పలు ప్రాంతాలల్లో వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతదేశాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. కరోనాకు తోడు ఈ భూకంపాలు సంభవించడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌‌లో భూమి కంపించింది. ధర్మశాలకు ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్‌పై 2.8 తీవ్రతతో సంభవించింది. శనివారం ఉదయం 8.15 గం.లకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఎటువంటి ప్రాణ, ఆ స్తినష్టం జరుగలేదు. 

Tags:    

Similar News