Maharashtra: భార్యలతో వేగలేని పురుషులు.. రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు

Maharashtra: భార్యలకేనా బాధలు మాకు లేవా.. కేవలం భర్త బాధితులపైనే ఫోకస్ చేస్తారు కానీ భార్య బాధితులు కూడా ఉంటారని ఎంతమందికి తెలుసు..

Update: 2022-06-14 06:18 GMT

Maharashtra: తమ ఇంట్లో తమకు అన్యాయం జరగకుండా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భార్యలతో బాధపడుతున్న పురుషులు మహారాష్ట్రలో ఆందోళన నిర్వహించారు. వీరంతా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షణలు చేస్తూ దేవుడిని ప్రార్థించారు. ఇలాంటి జీవిత భాగస్వామి వద్దే వద్దు అని వేడుకున్నారు.

తమ జీవిత భాగస్వాములతో సంతోషంగా లేని కొందరు పురుషులు తమ బాధలను పంచుకోవడానికి కొన్ని సంవత్సరాల క్రితం ఔరంగాబాద్‌లో 'పత్నీ పీడిత్' ఆశ్రమాన్ని స్థాపించారు.

సోమవారం ఇక్కడ వారు ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం జరుపుకునే 'వట్ పూర్ణిమ' సందర్భంగా మహిళలు మర్రిచెట్లను పూజించి సంతోషకరమైన దాంపత్య జీవితం కోసం, ఏడు జన్మలకైనా ఇలాంటి భర్తే కావాలని ప్రార్థిస్తారు.

కానీ అంతకు ముందు రోజే భార్యా బాధితులు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఏడు జన్మలు కాదు కదా.. ఏడు సెకన్లు కూడా ఇలాంటి భార్యలను భరించలేం బాబూ అని దండం పెట్టుకున్నారు.

"మహిళలకు సాధికారత కల్పించడానికి అనేక చట్టాలు చేయబడ్డాయి, కానీ అవి కూడా దుర్వినియోగం అవుతున్నాయి" అని అందులో ఒకరు అన్నారు.

"ఇప్పుడు, పురుషులు ఎదుర్కొంటున్న అన్యాయానికి వ్యతిరేకంగా గొంతును పెంచడానికి  చట్టాలు చేయవలసిన అవసరం కూడా ఉంది అని నొక్కి చెప్పారు. అందుకే ఈ ఆందోళన అని భార్య బాధితుల గ్రూపు సభ్యులు అంటున్నారు.

భార్యలకేనా బాధలు మాకు లేవా.. కేవలం భర్త బాధితులపైనే ఫోకస్ చేస్తారు కానీ భార్య బాధితులు కూడా ఉంటారని ఎంతమందికి తెలుసు.. గయ్యాళి భార్యతో వేగలేక నోర్మూసుకుని పడి ఉన్న పురుష పుంగవులు చాలా మందే ఉన్నారు.. వారందరి తరపున మేము ఈ నిరసన చేపడుతున్నాము అని వారు అంటున్నారు. 

Tags:    

Similar News