కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకే ప్రయోజనం : మోదీ

Update: 2020-11-30 15:43 GMT

కేంద్ర వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ వాటిని సమర్ధించుకున్నారు. సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించిన మోదీ.. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకే ప్రయోజనమన్నారు. రైతులకు చట్టపరమైన రక్షణ లభిస్తుందన్నారు. చిన్న రైతులు కూడా.. తమకు మద్దతు ధర లభించే చోటుకి తీసుకెళ్లి పంటను అమ్ముకోవచ్చన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో వారికి ఆర్థిక ప్రయోజనాలు జరుగుతాయన్నారు. స్వామినాథన్‌ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా.. రైతులకు ఒకటిన్న రెట్లు కనీస మద్దతు ధర లభిస్తుందన్నారు ప్రధాని మోదీ. వారణాసిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. ప్రధాని గంగానదిలో బోటులో విహరించారు. ఈ బోటు విహారంలో ఆయనతోపాటు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కూడా ఉన్నారు.


Tags:    

Similar News