కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

RBI: కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.;

Update: 2021-08-06 05:15 GMT

RBI: కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్‌బీఐ దైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు యథాతథ స్థితికి ఓకే చెప్పగా.. ఒకరు మాత్రం వ్యతిరేకించారు. దీంతో రెపోరేటు 4 శాతంగా.. రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనుంది. ఒక మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేట్‌, బ్యాంక్‌ రేట్‌లు 4.25 శాతంగా కొనసాగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు.

Tags:    

Similar News