దారుణం.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పదిమంది నవజాత శిశువులు మృతి

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరుగడంతో పది మంది నవజాత శిశువులు మరణించారు. మరో ఏడుగురు ప్రాణాలతో బయపడ్డారు.

Update: 2021-01-09 07:11 GMT

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. భందరా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరుగడంతో పది మంది నవజాత శిశువులు మరణించారు. మరో ఏడుగురు ప్రాణాలతో బయపడ్డారు. ఐసీయూ విభాగంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో మొత్తం 17మంది శిశువులు చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఐసీయూ గదినుంచి దట్టమైన పొగ బయటకు రావటాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే తలుపులు తెరిచి..అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు.

అక్కడికిచేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయినా అప్పటికే అందులో ఉన్న చిన్నారులు పదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఎస్ ఎన్ ఐసీలో ఔట్ బార్న్, ఇన్ బార్న్‌ అనే రెండు విభాగాలున్నాయి. ఇందులో ఔట్ బార్న్‌ లో ఉన్న 10మంది శిశువులు మరణించారు. మరో ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిని మరో ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News